ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై రాజకీయం తగదు - నేరస్థులు తప్పించుకోలేరు : హోమంత్రి అనిత - HOME MINISTER ON WOMEN SAFETY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 22, 2024, 5:51 PM IST

Home Minister On Women safety : జగన్ పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై జగన్ అండ్ కో ఏనాడూ నోరు మెడపలేదని దుయ్యబట్టారు. జగన్ 5 ఏళ్ల కాలంలో సీసీ కెమెరాల నిర్వహణ కు డబ్బులు సైతం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ 5ఏళ్లు పాపాలు చేసినందుకు ప్రజలు మూలన కూర్చోపెట్టారని విమర్శించారు. పోలీస్ వ్యవస్థ కు వైఎస్సార్సీపీ 700 కోట్లు బకాయిలు పెట్టిందని ఆక్షేపించారు.

ఇప్పటికైనా శవరాజకీయాలు మానుకోవాలి: జగన్ శవ రాజకీయాలు చేసేందుకు ఈ రోజు బయటకి వస్తున్నాడని ధ్వజమెత్తారు. జగన్ హయాంలో నిందితులు తప్పించుకొనేవారనీ తాము 24 గంటల్లో నిందితులను పట్టుకుంటున్నామని తెలిపారు. పులివెందులలో మహిళలపై అఘాయిత్యాలు జరిగితే జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఏ రోజూ కూడా ఎందుకు వెళ్ళలేదని నిలదీశారు. నేరస్తులు తప్పించుకోకుండా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 

ABOUT THE AUTHOR

...view details