ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేయాలంటూ ఉద్యోగుల కుటుంబాలు ఆందోళన - STEEEL PLANT FAMILIES PROTEST

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2024, 6:00 PM IST

Steeel Plant Families Protest: విశాఖ గాజువాకలో స్టీల్‌ ప్లాంట్‌ కార్మికుల కుటుంబసభ్యులు నిరసన చేపట్టారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయకుండా, సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించడం పోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత గనులు, ముడి సరకులు సరఫరా చేసి విశాఖ ఉక్కును కాపాడాలని కార్మిక నాయకులు కోరారు. 

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏర్పడిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కార్యకలాపాలు వేగవంతంగా జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, కార్మికుల కుటుంబ సభ్యులు మహా నిరసన తెలియజేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్​కు సొంత గనులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. ముడి సరుకు లేకుండా చాలాకాలం ప్లాంట్ ఇబ్బందులు ఎదుర్కొందని తెలిపారు. సుమారు 1350 రోజులకు పైగా ఉద్యమం చేస్తున్నా ప్రజాప్రతినిధుల్లో చలనం రావడం లేదని వాపోయారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాటం చేస్తామని కార్మిక నాయకులు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details