అమరావతిలో జీఎస్టీ రాష్ట్ర కార్యాలయం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు - GST Audit Commissioner meeting - GST AUDIT COMMISSIONER MEETING
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 20, 2024, 9:47 PM IST
State GST Audit Commissioner held Discussions with Officials : పన్నుల వసూళ్ల ద్వారానే దేశాభివృద్ధి వేగంగా జరుగుతుందని జీఎస్టీ ఆడిట్ రాష్ట్ర కమిషనర్ పి.ఆనంద్ కుమార్ అన్నారు. కావున వ్యాపారులు సకాలంలో, సజావుగా జీఎస్టీని చెల్లించాలని కోరారు. జీఎస్టీ వసూళ్లపై అధికారులు, వ్యాపార సముదాయాలతో చర్చించేందుకు ఆయన గుంటూరు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతేడాది కంటే పన్నుల వసూళ్లు చాలా పెరిగాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 902 యూనిట్లు ఆడిట్ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ 370 పూర్తి చేశామన్నారు. ఇంకా 572 యూనిట్లలో ఆడిట్ జరపాల్సి ఉందని వివరించారు.
గతేడాది రూ.72 కోట్లు మాత్రమే రికవరి చేయగా, ఈ ఏడాది జులై వరకూ రూ.108 కోట్లు రికవరి చేశామని తెలిపారు. అన్ని యూనిట్లను ఆడిట్ పూర్తి చేస్తే రికవరీ మరింతగా పెరుగుతుందని వెల్లడించారు. అమరావతిలో జీఎస్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు కోసం కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చిన తర్వాత కేంద్రం నిధులు ఇస్తుందని వివరించారు. ప్రస్తుతం విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న రాష్ట్ర కార్యాలయం అప్పుడు అమరావతి నుంచి పని చేస్తుందని తెలిపారు.