ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎన్నికల ఏర్పాట్లపై సీఈఓ ముఖేశ్​కుమార్ మీనా సమీక్ష - రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 2:48 PM IST

State Chief Electoral Officer Mukesh Kumar Meena Review : ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శుక్రవారం జిల్లా అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లతో పాటు ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై అధికారులతో చర్చించారు. 

ఓటర్ల నమోదు, మార్పులు చేర్పుల దరఖాస్తుల పరిష్కారం, యువ ఓటర్ల నమోదు అంశంపై సీఈఓ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అధికారులు, సిబ్బంది నియామకం, పోలింగ్ సిబ్బందికి శిక్షణ అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని సీఈఓ ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ ప్రణాళికతో పాటు ప్రాంతాల వారీగా పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్, అక్రమ నగదు స్వాధీనం, ఫిర్యాదుల పరిష్కారంపై తీసుకున్న చర్యలపైనా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చర్చించారు. ఏపీ సచివాలయం నుంచి నిర్వహించిన ఈ సమీక్షకు అదనపు ఎన్నికల అధికారులు హేరేంథిర ప్రసాద్, కోటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details