తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు - చంద్రప్రభ వాహనంపై శ్రీవారు

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Updated : 3 hours ago

Srivaru on Chandra Prabha Vahanam in Tirumala Live : శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. ఉదయం, రాత్రి వేళల్లో మలయప్పస్వామి పలు రకాల వాహనాలపై వివిధ రకాల వేషధారణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం మలయప్పస్వామి మాడ వీధుల్లో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్య, విద్య, ఐశ్వర్యం, సంతానం సిద్ధిస్తుందని భక్తకోటికి నమ్మకం. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం మలయప్పస్వామి వారు చంద్రప్రభ వాహనంపై విహరించి భక్తకులకు అభయమివ్వనున్నారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. ప్రస్తుతం శ్రీవారు చంద్రప్రభ వాహనంపై దర్శనమిస్తున్నాడు. ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details