LIVE : అయోధ్యలో అద్భుత ఘట్టం - బాలరాముడిపై సూర్యతిలకం - Sri Rama Navami 2024 - SRI RAMA NAVAMI 2024
Published : Apr 17, 2024, 12:13 PM IST
|Updated : Apr 17, 2024, 12:26 PM IST
Sri Rama Navami in Ayodhya Live : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత జరగనున్న మొదటి శ్రీరామనవమి వేడుకల కోసం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో యోగీ సర్కార్ అయోధ్య పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. 560 సీసీటీవీ కెమెరాలతో ఆలయం పరిసరాలను నిరంతరం కంట్రోల్ రూమ్‌ల నుంచి పోలీసులు పర్యవేక్షించనున్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని అయోధ్యకు లక్షల సంఖ్యలో భక్తులు సందర్శించారు. భద్రతా కారణాల దృష్ట్యా 4 రోజుల పాటు అంటే సోమవారం నుంచి గురువారం వరకు వీఐపీ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. అలాగే బాలక్రాముడి హారతి సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయోధ్య బాలరాముడి నుదుటన సూర్యకిరణాలు ప్రసరించాయి. మూడున్నర నిమిషాల పాటు ఈ అద్భుతం చోటు చేసుకుంది. 58 మిల్లీమీటర్ల పరిమాణంలో సూర్యకిరణాలు ప్రసరించాయి. ఏటా శ్రీరామనవమి రోజున ఈ దృశ్యం కనిపించనుంది. భక్తులు సూర్యతిలకాన్ని వీక్షించేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.
Last Updated : Apr 17, 2024, 12:26 PM IST