ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ఒంటిమిట్ట - విద్యుత్​ దీపాలు, పుష్పా శోభితంగా కోదండ రామాలయం - Sri Rama Navami Brahmetsavalu - SRI RAMA NAVAMI BRAHMETSAVALU

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 9:24 AM IST

Sri Rama Navami Brahmetsavalu at Ontimitta : వైఎస్సార్​ జిల్లాలో ఏకశిలానగరముగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట కోదండ రామాలయం నవమి శోభతో అలరాలుతోంది. ఈ దివ్య క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆలయాన్ని విద్యుత్​ దీపాలు, పూలతో అలంకరించారు. పది రోజులపాటు స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం అంకురార్పణతో శ్రీకారం చుట్టారు. ఇవాళ ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడానికి ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పాల్గొని వేద పండితుల మధ్య ఆగమశాస్త్రం ప్రకారం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్వామి వారి ఉత్సవ వేడుకలు జరుగుతున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. ఇవాళ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శేష వాహనంపై గ్రామ పురవీధుల్లో శ్రీరామచంద్రుడు విహరిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ అధికారులు కోరారు.  

ABOUT THE AUTHOR

...view details