ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కలప స్మగ్లింగ్​కు అటవీ అధికారులు సహకరిస్తున్నారు - చర్యలు తీసుకోండి: అయ్యన్నపాత్రుడు - Vana Mahotsavam Programme

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2024, 4:53 PM IST

Ayyanna Patrudu Allegations on Forest Department Officials : రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవ కార్యక్రమానికి  (Vana Mahotsavam Programme) ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అనకాపల్లిలో నిర్వహించిన వనమహోత్సవ సభలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ శాఖ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సీపట్నం డివిజన్​లో ఉన్న సామిల్​లో కలప స్మగ్లింగ్​ జరుగుతుందని, దీనికి కొంత మంది అటవీ శాఖ అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. కలప స్మగ్లింగ్​కు సంబంధించిన పూర్తి వివరాలను, అలాగే అక్రమాలకు సహకరించిన అధికారుల పేర్లతో తయారు చేసిన జాబితాను జిల్లా కలెక్టర్​, జిల్లా అటవీ శాఖ అధికారులకు అందజేశారు. ప్రతి ఒక్కరి సమక్షంలో వివరాలు అందజేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. దీనిపై విచారణ చేపట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కాలుష్యం తగ్గించేందుకు మొక్కలు నాటాలని అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. ప్రతి పాఠశాల, కళాశాలలోనూ మొక్కలు నాటే విధంగా ప్రతిపాదన చేయాలని అన్నారు. ప్రతి ఇంట్లోనూ విద్యార్థులు 3 మొక్కలు పెంచాలని, సంరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అనంతరం విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details