ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అనకాపల్లి జిల్లాలో దారుణం - ఆస్తి కోసం అత్తను నరికి చంపిన అల్లుడు - Son In Law Killed His Aunt - SON IN LAW KILLED HIS AUNT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 12:12 PM IST

Son-in-Law Killed Aunt in Anakapalle District : ఆస్తి కోసం అల్లుడు అత్తను కత్తితో నరికి చంపేసిన ఘటన అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్డూరులో జరిగింది. అడ్డూరుకు చెందిన సానబోయిన లక్ష్మి కుమార్తెను మామిడి పైడిరాజు కొన్నేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజుల క్రితం పైడిరాజుతో గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను కాపురానికి పంపడం లేదని నిందితుడు అత్తామామలపై కక్ష పెంచుకున్నాడు. వాళ్ల అడ్డు తొలగిస్తే భార్యతో పాటు ఆస్తి దక్కుతుందని ఆశపడ్డాడు. ఈ క్రమంలోనే పైడిరాజు కత్తితో అత్తను నరికి చంపేశాడు. అడ్డు వచ్చిన మామపై దాడి చేశాడు. గాయాల పాలైన అతడిని స్థానికులు విశాఖ కేజీహెచ్​ (KGH) కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు కూడా తల్లితో అడ్డూరులోనే ఉంటున్నారు. ఇదిలా ఉండగా గతంలో నిందితుడిపై కేసు ఉన్నట్లు స్థానికులు తెలుపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details