ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కడపలో 650 సెల్​ఫోన్లు రికవరీ - బాధితులకు అందజేత - Smart Phones Recovery in YSR

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 6:01 PM IST

Smart Phones Recovery in YSR Kadapa District : చోరీకి గురైన స్మార్ట్​ఫోన్ల రికవరీలో వైఎస్​ఆర్​ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని ఎస్పీ సిద్ధార్థ కౌశల్​ వెల్లడించారు. గత ఆరు నెలల్లో చోరీకి గురైన స్మార్ట్​​ ఫోన్​లను పోలీస్​ ఐటీ సెల్​ విభాగం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. దాదాపు రూ. 2 కోట్ల విలువైన 650 సెల్​ఫోన్లు రికవరీ చేశారని తెలిపారు. రికవరీ చేసిన స్మార్ట్​ ఫోన్​లను కడప పోలీస్​ మైదానంలో ఎస్పీ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు.

SP Handed Over the Recovered Cell Phones to the Victims : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్మార్ట్​ఫోన్​లను తిరిగి పొందవచ్చు అని సిద్ధార్థ కౌశల్​ పేర్కొన్నారు. ఫోన్​ పొగొట్టుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే సీఐఆర్​ ట్రాకింగ్​ ద్వారా పోయిన స్మార్ట్​ ఫోన్లు​ను​ రికవరీ చేస్తామని తెలియజేశారు. స్మార్ట్​ ఫోన్లు కొనేటప్పుడు తప్పకుండా రసీదు తీసుకొని తమ వద్ద జాగ్రత్తగా పెట్టుకోవాలని బాధితులకు అవగాహన కల్పించారు. 

ABOUT THE AUTHOR

...view details