LIVE : హైదరాబాద్‌లో పదో విడత బొగ్గు గనుల వేలం - ప్రత్యక్షప్రసారం - Coal Mine Auction 2024 Live - COAL MINE AUCTION 2024 LIVE
Published : Jun 21, 2024, 12:30 PM IST
|Updated : Jun 21, 2024, 1:52 PM IST
Singareni Participate Coal Mine Auction 2024 Live : దేశంలో కొత్త బొగ్గు గనుల వేలానికి కేంద్రం సిద్ధమైంది. ఇప్పటికే ఆ దిశగా బొగ్గు గనుల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటి వరకు ఒక్కో నగరంలో బొగ్గు గనుల వేలం నిర్వహిస్తూ వచ్చిన కేంద్రం, ఈసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తుంది. హైదరాబాద్‌లో పదో విడత బొగ్గు గనుల వేలం పాటు జరుగుతోంది. దీన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే, కార్యదర్శి అమృత్ లాల్ మీనా పాల్గొన్నారు. వేలం నిర్వహణలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని కేంద్రానికి భట్టి విజ్ఞప్తి చేశారు. వేలానికి పెట్టిన గనుల్లో సింగరేణి సమీపంలోని శ్రావణపల్లి బొగ్గు గని కూడా ఉంది. అక్కడ 11.99 కోట్ల టన్నుల బొగ్గు గనుల నిల్వలున్నట్లు భూగర్భ సర్వేలో తేలింది.
Last Updated : Jun 21, 2024, 1:52 PM IST