LIVE : రాష్ట్రవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు - ప్రత్యక్షప్రసారం
Published : Mar 8, 2024, 6:15 AM IST
|Updated : Mar 8, 2024, 9:56 AM IST
Mahashivaratri Live : మహా శివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలన్నీ ముస్తాబయ్యాయి. ముక్కంటిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరటంతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ క్షేత్రాలు, ఆలయాల్లో శివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రమంతా శివనామస్మరణతో మార్మోగుతోంది. అభిషేకాలు, కోడెమొక్కులతో భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. శివరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆలయాలను విద్యుత్ కాంతులతో ధగధగలాడుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ ప్రముఖ శైవ క్షేత్రాలు, ఆలయాలకు ప్రత్యేకంగా బస్సులు నడుపుతుంది. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శివుణ్ణి ఆరాధించే కోట్లాది మంది భక్తులకు శివరాత్రి అత్యంత ప్రాధాన్యమైన రోజుగా పేర్కొన్నారు. ఈ రోజు చేసే జాగరణకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని వివరించారు. ఈ పండుగ ప్రజలలో ప్రేమ, అభిమానం, సహనం, సోదరభావం పెంపొందిస్తుందని తమిళిసై సౌంద రాజన్ ఆకాంక్షించారు.
Last Updated : Mar 8, 2024, 9:56 AM IST