ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం - ఇద్దరు కర్నూలు వాసులు మృతి - Several People Died in RoadAccident - SEVERAL PEOPLE DIED IN ROADACCIDENT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 15, 2024, 5:13 PM IST

Several People from Kurnool Died in Road Accident at Telangana: తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. గద్వాల జిల్లా ఉండవల్లి వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరగగా కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కర్నూలు సమీపంలోని ఇ. తాండ్రపాడు గ్రామానికి చెందిన 13 మంది ఆటోలో తెలంగాణ రాష్ట్రంలోకి కూలి పనుల నిమిత్తం వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉండవల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆటోను వెనుక నుంచి ఓ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళ కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మృతి చెందిన మహిళలు సుజాత, లక్ష్మీ దేవిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో పది మందికి గాయాలు కాగా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. చనిపోయిన మహిళల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఇ.తాండ్రపాడు సర్పంచ్ బాలపీరా కోరారు.

ABOUT THE AUTHOR

...view details