ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కృష్ణా జిల్లాలో విషాదం - ఆడుకుంటూ చెరువులో పడి ఏడేళ్ల బాలిక మృతి - seven years old girl died in pond - SEVEN YEARS OLD GIRL DIED IN POND

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 15, 2024, 5:16 PM IST

Seven Years Old Girl Fell into Pond While Playing and Died : కృష్ణా జిల్లాలో విషాద ఘటన వెలుగుచూసింది. ఏడేళ్ల బాలిక ఆడుకుంటూ చెరువులో పడి మృతి చెందింది. ఉంగుటూరు మండలం ఆత్కూరులో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే, ఆత్కూరు గ్రామానికి చెందిన మానస అనే ఏడేళ్ల బాలిక నిన్న(బుధవారం) సాయంత్రం పాఠశాల నుంచి రాగానే తన తమ్ముడితో కలిసి ఆడుకోవడానికి ఇంటి సమీపంలోని కోనేరు చెరువు గట్టు వద్దకు వెళ్లింది. కొద్దిసేపు ఆడుకున్నాక తమ్ముడు కార్తికేయ ఇంటి వెళ్లిపోయాడు. మానస మాత్రం అక్కడే ఉన్న ఊయల ఊగి వస్తానని చెప్పి ఆగిపోయింది. చీకటి పడుతున్నా మానస ఇంటికి రాకపోవడంతో తల్లి అంజలి చెరువు దగ్గరకు వెళ్లింది. అక్కడ ఎంత వెతికిన మానస ఆచూసి లభించలేదు. అనంతరం బంధువుల సాయంతో ఊరంతా గాలించారు. 

అయినా ఆచూకీ లభించక పోవడంతో నిన్న అర్థరాత్రి వేళ ఆత్కూరు పోలీస్ స్టేషన్​లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు కోనేరు చెరువు చుట్టూ గాలిస్తుండగా ఈరోజు(గురువారం) తెల్లవారు జామున నీటిలో తేలియాడుతున్న బాలిక మృత దేహం కనిపించింది. పాపకి ఇదివరకే ఫిట్స్ ఉండటంతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం బాలిక మృతదేహన్ని గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details