ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రైవేటు బస్సులో భారీగా నగదు తరలింపు- సెబ్ అధికారుల తనిఖీల్లో రూ.60లక్షలు స్వాధీనం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 1:39 PM IST

SEB Officers Inspection of Vehicles 60 lakh Cash seized: కర్నూలు పంచలింగాల చెక్‌ పోస్టు వద్ద సెబ్‌ అధికారులు వాహనాల తనిఖీ నిర్వహించి భారీగా నగదు పట్టుకున్నారు. చెక్ పోస్టు వద్ద సెబ్ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 60లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి బెంగుళూరు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సును తనిఖీ చేయగా నగదు బయటపడినట్లు పోలీసులు వెల్లడించారు. బస్సులో ప్రయాణిస్తున్న జిలానీ, సుమన్‌ అనే ఇద్దరు వ్యక్తులు సరైన పత్రాలు లేకుండా నగదు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. నగదును స్వాధీనం చేసుకొని వారిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నోట్ల కట్టలతో ఓటర్లను ప్రభావితం చేసి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు రాష్ట్రంలో ఎక్కడికక్కడ ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సామాన్యులు సైతం ఎన్నికల నేపథ్యంలో డబ్బులను వెంట బెట్టుకొని ప్రయాణాలు చేయకూడదని పోలీసులు చెబుతున్నారు. నగదుతో పట్టుబడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details