అభివృద్ధి అంటే ఏమిటో ధర్మవరం ప్రజలకు చూపిస్తా : సత్యకుమార్ - Satyakumar election campaign - SATYAKUMAR ELECTION CAMPAIGN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 4, 2024, 10:52 PM IST
Satyakumar Election Campaign in Dharmavaram : అభివృద్ధి అంటే ఏమిటో ధర్మవరం నియోజకవర్గం ప్రజలకు చూపించే బాధ్యత తనదని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గానికి మెుదటి సారిగా వచ్చిన ఆయనకు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం హిందూపురం టీడీపీ పార్లమెంటు అభ్యర్థి బీకే పార్థసారథి, పరిటాల శ్రీరామ్ లతో కలిసి సత్యకుమార్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ ధర్మవరంలో గెలుపు తథ్యం కాబట్టే వైసీపీ నుంచి టీడీపీలోని భారీగా చేరికలు జరుగుతున్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల సహకారంతో గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధిని ధర్మవరంలో చేసి చూపిస్తా. రాష్ట్రం, కేంద్రంలో ఎన్టీయే ప్రభుత్వం ఏర్పడుతుంది. త్వరలో ధర్మవరం రూపరేఖలు మారుస్తాను. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి అందరూ కలిసి ముందుకు రావాలి. అక్రమాలు, దౌర్జన్యాలు చేసే వైసీపీ ప్రభుత్వానికి ఓటుతో బుద్ది చెప్పాలని సత్యకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ, మెుదటిసారి నియోజకవర్గానికి వచ్చిన సత్యకుమార్ ఇక్కడి సమస్యలు అన్ని తెలుసుకొని వచ్చారు. ఎవరెన్ని రాజకీయ కుట్రలు చేసిన సత్యకుమార్ భారీ మోజర్టీతో గెలవటం ఖాయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధర్మవరం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది.