తెలంగాణ

telangana

ETV Bharat / videos

సమగ్ర శిక్షా అభియాన్‌ ఒప్పంద ఉద్యోగుల అసెంబ్లీ ముట్టడి - అరెస్టు చేసిన పోలీసులు - Samagra Shiksha Abhiyan Employees - SAMAGRA SHIKSHA ABHIYAN EMPLOYEES

By ETV Bharat Telangana Team

Published : Jul 30, 2024, 4:25 PM IST

Samagra Shiksha Abhiyan Employees Protest At Assembly : సమగ్ర శిక్షా అభియాన్‌ ఒప్పంద ఉద్యోగుల డిమాండ్లపై ఉద్యోగుల సంఘం చేపట్టిన 'ఛలో అసెంబ్లీ' కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఒప్పంద పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భావితరానికి బంగారు బాటలు వేసే విద్యా శాఖలో పని చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని వాపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెగ్యులర్ చేయడంతో పాటు బేసిక్​ పే ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 

సుమారు 18సంవత్సరాల నుంచి 19వేల 600 మంది ఒప్పందం ప్రకారమే ఉద్యోగాలు చేస్తున్నామని, రెగ్యులర్ చేసి కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు బలవంతంగా వారిని అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. 

ABOUT THE AUTHOR

...view details