తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : నిజామాబాద్​లో సద్దుల బతుకమ్మ సంబురాలు ప్రత్యక్ష ప్రసారం - SADDULA BATHUKAMMA CELEBRATIONS

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2024, 6:02 PM IST

Updated : Oct 10, 2024, 7:36 PM IST

Saddula Bathukamma Celebrations 2024 :  రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఊరూవాడా.. ఉయ్యాల పాటలతో మారుమోగాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు ఆడిపాడారు. గాజుల చేతుల చప్పట్లతో.. వీధులన్ని మారుమోగాయి. హరివిల్లు నేలపై పరుచుకుందా అన్నట్లుగా మహిళలు, యువతుల కేరింతలతో ఊర్లన్నీ సందడిగా మారాయి. గౌరమ్మను కొలుస్తూ జరుపుకున్న సద్దుల బతుకమ్మ వేళ రాష్ట్రమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా చౌరస్తాలన్నీ బతుకమ్మలతో, ఆడపడుచులతోనూ మురిసిపోయాయి. మహిళామణుల పండుగగా పిలుచుకోనే బతుకమ్మలో సందడిగా ఆడిపాడుతున్నారు. తీరొక్క పూలతో అందంగా తీర్దిదిద్దిన బతుకమ్మల చుట్టూ చేరి మహిళలు ఆడి పాడుతున్నారు. కోలాలతో ఆడుతున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ సింగరమైన పాటను పాడుతున్నారు. 9 రోజుల ఈ వేడుకలో తంగేడు, జిల్లేడు, గునుగు, బంతి, చేమంతి ఇలా ఎన్నెన్నో కుసుమాలు ఈ పండుగ కోసమే పూశాయా అనిపిస్తాయి. బతుకమ్మ పండుగను ఆధ్యాత్మిక సాధకులు సామూహిక 'శక్తి ఉపాసన'గా, ఆత్మచైతన్యానికి మేల్కొలుపుగా భావిస్తారు. బతికించే అమ్మ' అనే ఆరాధనా భావంతో అమ్మవారికి నీరాజనాలు అర్పించటం బతుకమ్మ పండుగలో అంతరార్థం. ఆరోగ్యకర జీవనం, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం అమ్మను వేడుకోవటం ఆనవాయితీ.
Last Updated : Oct 10, 2024, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details