సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు వద్ద రూ.10లక్షల విలువైన మద్యం పట్టివేత - RS 10Lakhs Liquor Seize In Revuru - RS 10LAKHS LIQUOR SEIZE IN REVURU
Published : May 11, 2024, 7:26 PM IST
RS 10Lakhs Liquor Seize In Revuru : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రేవూరులో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.10 లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఓ వాహనంలో అక్రమంగా మద్యం తరలిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో రేవూరు రోడ్లో వాహన తనిఖీల్లో భాగంగా ఓ వాహనంలో మద్యాన్ని తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఏపీ 37 టీకే 3371అనే నంబర్ కలిగిన మినీ వ్యాన్ ద్వారా 119 కాటన్ల మద్యాన్ని తరలిస్తుండగా పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ అక్రమ మద్యం కోదాడకు సంబంధించిన ఓ వైన్ షాప్ నుంచి తరలిస్తున్నట్లుగా సమాచారం.
Heavy Liquor Seizure at Mahabubnagar : ఇలాంటి ఘటనే ఈ రోజు మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో కూడా జరిగింది. అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.2 కోట్లు విలువైన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. బాలానగర్ చౌరస్తాలో పోలీసులు తనిఖీల్లో భాగంగా గుర్తించారు. అయితే పోలింగ్‌కు రెండు రోజుల ముందు పెద్ద ఎత్తున మద్యం పట్టివేయడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ మద్యాన్ని ఎవరు ఎక్కడి నుంచి తరలించారు అనే విషయాలు తెలియరావాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నామని పోలీసులు తెలిపారు.