అయ్యయ్యో ఎంత పనైంది దేవుడా!! - తీర్థయాత్రలకు వెళ్లొచ్చే సరికి ఇంట్లో చోరీ - THEFT AT A HOUSE IN SECUNDERABAD - THEFT AT A HOUSE IN SECUNDERABAD
Published : Jul 3, 2024, 10:52 AM IST
Thieves Stole Gold and Money in House in Secunderabad : తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వచ్చేలోగా దొంగలు ఇంటికి కన్నం వేసిన ఘటన సికింద్రాబాద్ జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దమ్మాయిగూడలోని అంజనాద్రి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న దాసరి మహిపాల్ రెడ్డి ఇంట్లో సోమవారం రాత్రి దొంగలు చొరబడి నాలుగు తులాల బంగారంతో పాటు రూ.6 వేల నగదును అపహరించారు.
ఇద్దరు వ్యక్తులు గోడ దూకుతున్నట్లు కెమెరాలో రికార్డు : రెండు రోజుల క్రితం శ్రీకాళహస్తి తీర్థయాత్రకు వెళ్లి మంగళవారం రాత్రి ఇంటికి చేరుకున్న మహిపాల్ కుటుంబ సభ్యులు ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. బీరువా పగలగొట్టి అందులో నగదు, నగలను దుండగులు అపహరించారు. ఇద్దరు వ్యక్తులు గోడ దూకుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలలో నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జవహర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలిసిన వ్యక్తులు దొంగతనం చేశారా అన్న కోణంలో విచారిస్తున్నారు.