ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వేసిన 3 నెలలకే పెచ్చులూడిపోయిన రోడ్డు - ఓట్ల కోసమే వేశారని స్థానికుల ఆగ్రహం - వీడియో వైరల్​ - Road conditions in tribal villages - ROAD CONDITIONS IN TRIBAL VILLAGES

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 3, 2024, 5:00 PM IST

Road Conditions in Tribal Villages of Manyam District : ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఓ ప్రజాప్రతినిధి ఆగమేఘాల మీద గిరిజన గ్రామాలకు బీటీ రోడ్లు వేశారు. తమ సమస్య తీరిందనుకుని స్థానికులు సంబరపడ్డారు. కానీ ఆ ఆనందం మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. మూడు నెలలు కాకముందే ఆ రోడ్డు దుస్థితిని చూసి అందరూ విస్తుపోతున్నారు. రోడ్డుపై ఎక్కడ చూసినా పెద్ద పెద్ద పెచ్చులు లేచిపోయి భారీ గుంతలు దర్శనమిస్తుడటంలో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. 

వివరాల్లోకి వెళ్తే మన్యం జిల్లా కొమరాడ మండలం కల్లికోట పంచాయతీ గారవలస గ్రామానికి మూడు నెలల క్రితం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి రోడ్డు వేయించారు. ఇలా బీటీ రోడ్డు వేసిన 15 రోజులకే రోడ్డు పాడైపోవటం గమనించిన స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కలెక్టర్ స్పందించి రోడ్డు నాణ్యతపై దర్యాప్తు చేపట్టాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. అయితే కోమరాడ మండలం దుగ్గి గ్రామం జంక్షన్ నుంచి గారవలస గ్రామానికి వేసిన బీటి రోడ్డు పెచ్చులు లేస్తున్నాయంటూ ఓ రైతు తీసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. 

ABOUT THE AUTHOR

...view details