నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఇద్దరు మృతి, మరో 10మందికి తీవ్ర గాయాలు - Nellore Road Accident Several Dead - NELLORE ROAD ACCIDENT SEVERAL DEAD
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 19, 2024, 5:30 PM IST
Massive Road Accident Nellore District: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు సమీపంలో ముంబయి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో 10మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
మృతులను ప్రకాశం జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన మరియమ్మ, వెలిగండ్ల మండలం కంగనంపాడు గ్రామానికి చెందిన డేవిడ్‌గా గుర్తించారు. కనిగిరి నుంచి నెల్లూరు వైపు వెస్తున్న ఆర్టీసీ బస్సు, ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 47మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.