సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు - Road Accident Sathya Sai District
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 30, 2024, 2:25 PM IST
Gangasanipally Road Accident Today : సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తనకల్లు మండలం గంగసానిపల్లి జాతీయ రహదారిపై ఆగి ఉన్న రెండు ఆటోలను లారీ ఢీకొని ఒకరు మృతి చెందారు. ఇందుకు సంబంధించి తనకల్లు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తనకల్లు నుంచి అన్నమయ్య జిల్లా బి. కొత్తపేటకు వెళ్తుండగా ఓ ఆటో ఆగిపోయింది. అందులో ప్రయాణిస్తున్న మహమ్మద్ అలీ, ఆరిఫ్ ఆటోకు మరమ్మతులు చేస్తున్నారు.
Road Accident in Sathya Sai District : ఇంతలోనే మరో ఆటోలో వచ్చిన రామకృష్ణ వారిని చూసి ఆగారు. అదే సమయంలో కదిరి నుంచి మదనపల్లె వైపు వెళ్తున్న తమిళనాడుకు చెందిన లారీ వేగంగా వచ్చి రెండు ఆటోలను ఢీకొట్టింది. ఈ ఘటనలో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. మహమ్మద్ అలీ, ఆరిఫ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న తలకల్లుకు చెందిన వందేమాతరం బృందం ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహమ్మద్ అలీ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించామని తనకల్లు పోలీసులు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.