బొలెరో-లారీ ఢీ - ముగ్గురు మృతి, నలుగురి పరిస్థితి విషమం - సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 12, 2024, 9:53 AM IST
Road Accident in Satyasai District : శ్రీ సత్యసాయి జిల్లా ఆగలి మండలం ఇరిగేపల్లి వద్ద అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులు ఎక్కువగా ఉండటంతో సిరా, తుమకూరు, బెంగళూరు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. రొళ్ళ మండలం దాసప్ప పాలెం గ్రామానికి చెందినవారు సిరా పట్టణంలో వివాహ వేడుక ముగించుకొని బొలెరో వాహనంలో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో ఇరిగేపల్లి వద్ద బొలెరో, సిమెంట్ లారీ ఒకదానికొకటి బలంగా ఢీ కొన్నాయి.
Ciment Truck, Bolero Hits & Three Died : ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలోని కాంతప్ప, అమ్మజక్క, రంగప్ప అక్కడికక్కడే మృతి చెందారు. 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు కర్ణాటకలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంతో ఆ కుటుంబాల్లో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.