ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆగిఉన్న లారీని వెనుకనుంచి ఢీకొట్టిన కంటైనర్‌ - తండ్రీ కుమారుడు మృతి - Road Accident in NTR District - ROAD ACCIDENT IN NTR DISTRICT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 12:11 PM IST

Road Accident in NTR District: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కుమారుడు మృతి చెందారు. జాతీయ రహదారి వద్ద ఆగి ఉన్న ఖాళీ గ్యాస్ సిలిండర్ల లారీని, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున కంటైనర్ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో గ్యాస్ సిలిండర్ల లారీ ముందు ఉన్న మాధవరావు, అతని కుమారుడు రామరాజు అక్కడికక్కడే మరణించారు. 

ప్రమాదానికి కారణమైన కంటైనర్‌ ఆగకుండా వెళ్లిపోయిందనే సమాచారం అందుకున్న కంచికచర్ల హైవే మొబైల్‌ పోలీసులు కేసర వద్ద ఆ కంటైనర్‌ను ఆపి పట్టుకున్నారు. ఈ ప్రమాదానికి ముందు నిలిచిఉన్న ఈ లారీని, ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో గ్రామస్థులంతా అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటి తరువాత ఆగి ఉన్న లారీని కంటైనర్‌ ఢీకొట్టింది. మృతులు ఎన్టీఆర్‌ జిల్లా ఐతవరం గ్రామానికి చెందిన సంకు మాధవరావు(65), అతని కుమారుడు సంకు రామరాజు(45)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details