గంగవరం పోర్ట్ వాటాదారులకు స్టీల్ ప్లాంట్ సీఎండీ అభినందనలు - RINL CMD Atul Bhat - RINL CMD ATUL BHAT
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 17, 2024, 10:44 PM IST
RINL CMD Atul Bhat Thanked Stakeholders of Gangavaram Port: అదానీ గంగవరం పోర్ట్ నుంచి విశాఖ ఉక్కు కర్మాగారానికి అత్యవసరమైన ముడిసరుకు రవాణా సమస్యను పరిష్కారానికి కృషిచేసిన వాటాదారులకు ఆర్ఐఎన్ఎల్(RINL) సీఎండీ అతుల్ భట్ కృతజ్ఞతలు తెలిపారు. 12 ఏప్రిల్ 2024 నుంచి అదానీ గంగవరం పోర్ట్ లిమిటెడ్ కార్మికులు ఆందోళనకు దిగడంతో ఆ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దాంతో విశాఖ ఉక్కు కర్మాగార ఉత్పత్తి ప్రక్రియలకు కీలకమైన ముడి పదార్థాలు, బొగ్గు, సున్నపురాయిని సేకరించే ఆర్ఐఎన్ఎల్ సామర్థ్యంపై గణనీయంగా ప్రభావితం చూపింది ఆర్ఐఎన్ఎల్కు అవసరమైన ముడిసరుకు రవాణా సంక్షోభాన్ని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించిన వాటాదారులందరికీ అతుల్ భట్ అభినందనలు తెలిపారు.
అతుల్ భట్ తన సందేశంలో, జిల్లా పరిపాలన విభాగం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చుట్టూ నివసిస్తున్న సోదరులు మరియు సోదరీమణులకు, ఆర్ఐఎన్ఎల్ ఉద్యోగులు, ట్రేడ్ యూనియన్ సభ్యులు, స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్, ప్రజాప్రతినిధులు, నివాసితులతో సహా కాంట్రాక్ట్ కార్మికులు, ఇతర వాటాదారులకు మరియు నిర్వాసితులైన వ్యక్తులు ఈ తీవ్రమైన ముడిసరుకు సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఆర్ఐఎన్ఎల్తో కలిసి పని చేయడంలో సకాలంలో జోక్యం చేసుకున్నందుకు అతుల్ భట్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.