ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సీఎం జగన్‌పై రాయి దాడి కేసు - నిందితుడి బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ - Jagan Reddy Stone Pelting Case - JAGAN REDDY STONE PELTING CASE

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 27, 2024, 4:30 PM IST

Jagan Reddy Stone Pelting Case: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్ పై విజయవాడ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. నిందితుడు సతీష్ కుమార్ బెయిల్ పిటిషన్ పై ఇరువైపుల వాదనలు ముగిశాయి. నిందితుడు తరపు న్యాయవాది సలీం వాదనలు వినిపించారు. సతీష్​ను పోలీసులు కేసులో అక్రమంగా ఇరికించారని పిటిషనర్​కు బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది సలీం కోరారు. విజయవాడ 8వ అదనపు జిల్లా న్యాయస్థానం వాదనల అనంతరం ఆర్డర్స్ రిజర్వ్ చేసింది. రేపు న్యాయమూర్తి ఉత్తర్వులు ఇవ్వనున్నారు. 

ఇదీ జరిగింది : మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం పరిధిలో సీఎం జగన్ బస్సు యాత్రలో పాల్గొన్నారు. సింగ్‌నగర్‌లో గంగానమ్మ గుడి వద్ద వైసీపీ ఎమ్మెల్సీ రుహుల్లా నివాసానికి అతి సమీపంలోని ఓ ప్రైవేటు స్కూల్‌ వద్ద గుంపులో నుంచి వచ్చిన రాయి తగిలి సీఎం జగన్​కు స్వల్ప గాయమైంది. సీఎం పక్కనే ఉన్న వైసీపీ సెంట్రల్‌ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్‌కూ రాయి తగిలి స్వల్ప గాయమైంది. రాయిదాడిపై విచారణ చేపట్టిన పోలీసులు ఈ కేసులో నిందితుడు సతీష్​ని అదుపులోకి తీసుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details