పోలీసుల కళ్లు కప్పి రిమాండ్ ఖైదీ పరార్ - ఎలా అంటే? - Remand Prisoner Escaped - REMAND PRISONER ESCAPED
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 18, 2024, 2:06 PM IST
Remand Prisoner Escaped from Police : స్థానచలనం చేస్తుడంగా పోలీసుల కళ్లు కప్పి రిమాండ్ ఖైదీ పరార్ అయ్యారు. విశాఖపట్నం నుంచి అనంతపురం తీసుకొస్తున్న రిమాండ్ ఖైదీ నరేష్ పోలీసుల కళ్లు కప్పి తప్పించుకున్నాడు. విశాఖ నుంచి అనంతపురానికి రైల్లో తీసుకువచ్చే క్రమంలో ఈ సంఘటన జరిగింది. మార్కాపురం వద్ద ఆగి ఉన్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ నుంచి రిమాండ్ ఖైదీ నరేష్ తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Remand Prisoner Naresh : రిమాండ్ ఖైదీ నరేష్ స్వస్థలం అనంతపురం జిల్లా గుత్తి మండలం పి. కొత్తపల్లి అని పోలీసులు తెలిపారు. ఈ మధ్య కాలంలోనే గంజాయి రవాణా కేసులో పట్టుబడ్డారని పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి గంజాయి తీసుకొచ్చి గుత్తి పరిసర ప్రాంతాల్లో విక్రయించేవాడని తెలియజేశారు. ఇతనిపై గుత్తి పోలీసు స్టేషన్లో రెండు కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. తప్పించుకున్న నరేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మార్కాపురం సమీపంలోని అన్ని పోలీస్ స్టేషన్లతో పాటు గుత్తిలోని పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు.