ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విపరీతమైన దుర్గంధం- పది మంది సిబ్బంది అస్వస్థతకు గురైనా ఆగని సహాయక చర్యలు - Relief Measures in Flooded Areas - RELIEF MEASURES IN FLOODED AREAS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 10, 2024, 5:17 PM IST

Fire Department Relief Measures in Vijayawada Flood Affected Areas : విజయవాడ ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇళ్లలో పేరుకుపోయిన మట్టిని అగ్నిమాపక సిబ్బంది తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు 42 వేల ఇళ్లలో మట్టిని తొలగించామని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ వెంకట రమణ తెలిపారు. మెుత్తం లక్షకు పైగా ఇళ్లలోని గ్రౌండ్ ఫ్లోర్లు పూర్తిగా మునిగి పోయయన్నారు. శుభ్రం చేసే సమయంలో కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన దుర్ఘంధం రావటంతో 10 మంది సిబ్బంది అనారోగ్యానికి గురయ్యారు. అయినా అగ్నిమాపక సిబ్బంది పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. సింగ్‌నగర్‌లో పలు కాలనీల్లో దారులు, ఖాళీ స్థలాల్లో కాసిన్ని నీళ్లున్నాయి. వాటినీ తోడేస్తున్నారు. కాలువల్లో వ్యర్థాలను పొక్లెయిన్లతో తొలగిస్తున్నారు. ఇళ్లల్లోని వరద, బురద, ఇసుక మేటలు, వ్యర్థాలను అగ్నిమాపక శాఖ, పారిశుద్ధ్య సిబ్బంది తొలగిస్తున్నారు. మరో వారం రోజుల్లో అన్ని ముంపు ప్రాంతాల్లోని ఇళ్లలోని మట్టిని తొలగిస్తామంటున్న వెంకట రమణతో ఈటీవీ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details