ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'మారుమూల గ్రామాలకూ వైద్య సేవలు - 100 కిలోమీటర్ల వరకూ ప్రయాణించే రెడ్ వింగ్ డ్రోన్లు' - RED WING REPRESENTATIVES INTERVIEW

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 22, 2024, 8:46 PM IST

RED WING DRONES REPRESENTATIVES INTERVIEW: ఈ ఆధునిక యుగంలోనూ మారుమూల గ్రామాల్లో వైద్య సేవలందక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని, అలాంటి వారికి డ్రోన్ సాంకేతికత వరంగా మారిందని రెడ్‌ వింగ్ స్టార్టప్‌ నిర్వహకులు తెలిపారు. సమాజంలో డ్రోన్ల ప్రాధాన్యతను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ సమ్మిట్​ను ఏర్పాటు చేయడం శుభపరిణామం అని అన్నారు. ఈ సమ్మిట్​కు హాజరవటం ద్వారా రెడ్‌ వింగ్ డ్రోన్లను అందరికీ పరిచయం చేసే అవకాశం లభించిందన్నారు. 

రానున్న రోజుల్లో వ్యవసాయం, వైద్యం, పర్యటక రంగాల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషించనున్నాయని రెడ్ వింగ్ నిర్వాహకులు తెలిపారు. గ్రామ స్థాయిలో సదుపాయాలు లేని ప్రాంతాలకు రెడ్ వింగ్ డ్రోన్ల ద్వారా సేవలు అందించవచ్చని తెలిపారు. ఈ డ్రోన్లు 50 నుంచి 100 కిలో మీటర్ల వరకూ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వరకూ మందులను తీసుకుని వెళ్తాయని, అదే విధంగా తిరుగు ప్రయాణంలో రక్త పరీక్షల కోసం శాంపిల్స్​ను సైతం తీసుకుని వస్తుందని అన్నారు. ఏపీ ప్రభుత్వం చూపుతున్న చొరవతో రానున్న రోజుల్లో స్టార్టప్‌ సేవలను మరింత విస్తరించనున్నామంటున్న రెడ్ వింగ్ ప్రతినిధితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details