తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ - ప్రత్యక్షప్రసారం - Ramoji Rao Memorial Program Live - RAMOJI RAO MEMORIAL PROGRAM LIVE

By ETV Bharat Telangana Team

Published : Jun 27, 2024, 3:42 PM IST

Updated : Jun 27, 2024, 6:36 PM IST

Ramoji Rao Memorial Program Live : రామోజీరావు స్వయంకృషితో ఎదిగి, తెలుగువారికి ఎనలేని కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన దార్శనికుడు. మట్టి నుంచి మాణిక్యాలు సృష్టించిన కృషీవలుడు. అనితరసాధ్యమైన పట్టుదల, క్రమశిక్షణలతో సంపద సృష్టించి వేల మందికి ప్రత్యక్షంగా, మరెన్నో వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించిన పారిశ్రామికుడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. మీడియా, వినోదం, ఆర్థిక, ఆతిథ్య, వ్యాపార రంగాల్లో ఆయన ఒక ఎవరెస్టు శిఖరం. ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఇన్ని వైవిధ్యమైన పనులను చేయగలరా, ఇన్నిన్ని విజయాలు సాధించగలరా అని ఆశ్చర్యపోయే విజయ ప్రస్థానం ఈ పద్మవిభూషణుడిది! రామోజీరావు అసలైన సంపద విశ్వసనీయత. 50 ఏళ్లుగా ఈనాడు ప్రజాభిమానం పొందడానికి ఆయనపై ప్రజలకున్న అచంచల విశ్వాసమే కారణం. అతి సున్నితమైన మార్గదర్శి వంటి ఆర్థిక సంస్థపై ప్రభుత్వ పెద్దలు చేసిన దుష్ప్రచారాలను, దాడులను 'ప్రతి పైసాకూ నాదీ పూచీ' అని ఆయన అన్న నాలుగు భరోసా మాటలే తులసిదళంలా అడ్డుకున్నాయి. ప్రజలపై ఆయనకు చిన్న చిన్న వదంతులు సైతం ప్రభుత్వ రంగ బ్యాంకులను, బలమైన ప్రైవేట్‌ రంగ బ్యాంకులను ఎలా అతలాకుతలం చేశాయో అంతో ఇంతో ఆర్థిక పరిజ్ఞానం ఉన్న అందరికీ తెలిసిందే. ఆ మహనీయుడి సంస్మరణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ నేపథ్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న రామోజీరావు సంస్మరణ సభ ప్రత్యక్షప్రసారం మీకోసం.  
Last Updated : Jun 27, 2024, 6:36 PM IST

ABOUT THE AUTHOR

...view details