ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తప్పని తెలిసినా- ఆ వ్యక్తిపై మున్సిపల్, విద్యాశాఖ అధికారులకు ఎందుకింత ప్రేమ: టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి - YCP councilor Kondalarao

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 4, 2024, 9:22 PM IST

RamGopal Reddy Comments On YCP Councilor Kondalrao: వైఎస్సార్​ జిల్లా పులివెందుల వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్​గా ఉన్న కొంగనపల్లి కొండలరావు ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కూడా కొనసాగుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి  రామగోపాల్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ అండదండలతోనే అధికారులు చర్యలు తీసుకోవటంలేదని భూమిరెడ్డి మండిపడ్డారు. అతడు చేసేది తప్పని తెలిసినా విద్యాశాఖ, మున్సిపల్ అధికారులు కొండల్ రావుకు మద్దతుగా నిలుస్తున్నారని భూమిరెడ్డి అన్నారు. కొండలరావుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

1988లో డీఎస్సీ అభ్యర్థులైన కొండలరావుకు గత ఏడాది ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది. కానీ మున్సిపల్​ అధికారులు, పాలక మండలి ఏమీ తెలియనట్లు నిమ్మకు నిరెత్తినట్లు ఉండటం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం. లింగాల మండల విద్యాశాఖ అధికారులు, కడప జిల్లా విద్యాశాఖ అధికారులు కొండలరావుకు ఉద్యోగం ఇస్తామన్నారు. అతడు పులివెందుల మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్​గా ఉన్న విషయం కూడా అధికారులకు తెలుసిన ఉద్యోగం ఇస్తామన్నారు. డిక్లరేషన్​ ఫారం కూడా ఆయనకు ఇవ్వడం జరిగింది. అప్పటి డీఈవోగా ఉన్న రాఘవరెడ్డి లక్షల రూపాయలు తీసుకొని కొండలరావుకు ఉద్యోగ అపాయింట్​మెంట్​ ఇవ్వడం జరిగింది. లింగాల మండల అధికారుల దృష్టికి చాలా మంది టీచర్లు తీసుకెళ్లిన ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కొండలరావుపై చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. -భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, శాసనమండలి సభ్యుడు 

ABOUT THE AUTHOR

...view details