LIVE : రాజ్యసభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - Rajya Sabha session 2024 live - RAJYA SABHA SESSION 2024 LIVE
Published : Jul 2, 2024, 11:03 AM IST
|Updated : Jul 2, 2024, 8:39 PM IST
Rajya Sabha Session Live : . రెండు రోజులుగా రాజ్యసభలో ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల మధ్య వాడీవేడి సంభాషణ కొనసాగింది. అలాగ రాజ్యసభలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగింది. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతంపై మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా సభలో వాతావరణం వేడెక్కింది. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతం దేశానికి ప్రమాదకరమని ఆరోపించారు. యూనివర్సిటీలు, ఎన్‌సీఈఆర్‌టీతో పాటు ఇతర విద్యాసంస్థల్లో వైస్ ఛాన్సలర్లు, ప్రొఫెసర్ల నియామకాలపై ఆర్‌ఎస్‌ఎస్ ప్రమేయం ఉంటోందన్నారు. ఖర్గే వ్యాఖ్యలపై ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మండిపడ్డారు. "ఈ సంస్థ దేశ అభివృద్ధికి కృషి చేస్తోంది. దేశ ప్రగతి కోసం శ్రమిస్తున్న ఎంతోమంది గొప్పవారు దీనిలో ఉన్నారు. అలాంటివారు ఆర్‌ఎస్‌ఎస్‌లో భాగమవడం నేరమా?" అని ప్రశ్నించారు. నీట్ యూజీ-2024 పేపర్ లీకేజీ వ్యవహారం పార్లమెంట్ ఉభయసభల్లో అగ్గి రాజేస్తోంది. ఈ అంశంపై చర్చ జరపాలన్న విపక్షాల డిమాండ్ నేపథ్యంలో గందరగోళం తలెత్తిన విషయం తెలిసిందే. రాజ్యసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
Last Updated : Jul 2, 2024, 8:39 PM IST