ఎన్నికల తర్వాత అధికార మార్పిడి మాత్రమే జరిగింది - మిగతాదంతా సేమ్ టు సేమ్ బీఆర్ఎస్సే : రఘునందన్ రావు - Raghunandan Rao Latest News
Published : Feb 1, 2024, 7:25 PM IST
Raghunandan Rao Fires on Congress : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత అధికార మార్పిడి జరిగింది, జెండాల రంగులు మారాయి, అంతేకానీ బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఆలోచనలు ఒకేలా ఉన్నాయని దుబ్బాక మాజీ శాసనసభ్యులు రఘునందన్ రావు ఆరోపించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో మెదక్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల విస్తృత సమావేశానికి ఆయన హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పని చేసి ప్రధాని మోదీని మూడోసారి ప్రధానమంత్రి చేయాలన్నారు.
Raghunandan Rao Fires On Congress : 2018 డిసెంబర్లో బీఆర్ఎస్ గెలిచిన తర్వాత సారు, కారు, 16, దిల్లీలో సర్కారు అని మాట్లాడారని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధమైన ధోరణిలో ఉన్నట్టు కనబడుతుందని విమర్శించారు. భారతదేశమంతా ప్రధాని మోదీ గాలి వీస్తుందని, 400కు పైగా ఎంపీ సీట్లను తమ పార్టీ గెలుచుకొని, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని జోస్యం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు తెలంగాణకు ఏం చేస్తారో చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.