బీఆర్ఎస్, బీజేపీ పొత్తుపై రేవంత్ రెడ్డి మాట్లాడటం సరికాదు : రఘునందన్ రావు - రేవంత్‌రెడ్డిపై రఘనందనరావు ఫైర్
Published : Feb 25, 2024, 3:35 PM IST
Raghunandan Rao Fires On CM Revanth : బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర మూడవ సభ విజయవంతంగా పూర్తయిందని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలు నమ్మవద్దని కార్యకర్తలు, ప్రజలకు సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 17 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
బీజేపీ పొత్తుపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటం సరికాదని రఘునందన్ రావు హితవు పలికారు. పొత్తు ఉంటే, ఆ విషయం తమ పార్టీ ప్రకటిస్తుందని తెలిపారు. అనవరసంగా మీడియాకు ఊహగానాలు ఇవ్వద్దని సూచించారు. 5 ప్రాంతాల నుంచి ప్రారంభమైన విజయ సంకల్ప యాత్ర ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ విజయంగా కొనసాగుతోందని వెల్లడించారు. ఈ యాత్ర ద్వారా ఎందుకు తమకు ఓట్లు వేయాలన్న విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. బీజేపీపైన, నరేంద్ర మోదీపైన ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరుగుతుందన్న రఘునందన్, పార్టీకి సంబంధించిన విషయాలపై అవాస్తవాలు చూపించొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశఆరు.