ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వందల కోట్ల అక్రమాలకు పాల్పడిన అమిగోస్ మినరల్స్ పై చర్యలు తీసుకోవాలి - AMIGOS FRAUD ISSUE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2024, 7:46 PM IST

Amigos Fraud Issue in Anantapur : అమిగోస్ మినరల్స్ అనే సంస్థ ప్రభుత్వానికి వందల కోట్లు చెల్లించకుండా అక్రమాలకు పాల్పడిందని అనంతపురానికి చెందిన ఓ క్వారీ యజమాని రాజేష్ ఆరోపించారు. ప్రభుత్వం రెండు సంవత్సరాలకుగాను అమిగోస్ మినరల్స్ సంస్థకు రూ. 259 కోట్లు చెల్లించేలా ఒప్పందంతో కాంట్రాక్టు ఇచ్చారన్నారు. అయితే ఈ మొత్తాన్ని చెల్లించకుండా అమిగోస్ నిర్వహిస్తున్న కొంతమంది అక్రమంగా డబ్బును తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. అక్రమంగా అనుమతులు ఇస్తూ క్వారీ యజమానుల నుంచి డబ్బులు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కళ్యాణదుర్గం, మడకశిర, హిందూపురం నియోజకవర్గాల్లో ఈ డబ్బు మొత్తాన్ని వాడుకున్నారని ఆరోపించారు. ఇప్పటికీ క్వారీల యజమానులతో డబ్బును వసూలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వానికి మాత్రం ఈ డబ్బు చెల్లించడం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ అధికారులు ఈ అమిగోస్ సంస్థ నుంచి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బును వసూలు చేయాలని కోరారు. ప్రభుత్వం మారిన ఇప్పటికీ వైఎస్సార్సీపీ కొమ్ము కాసిన అధికారులు అదే విధంగా అవినీతి అక్రమాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ABOUT THE AUTHOR

...view details