బాబోయ్ కొండచిలువ- బాత్రూమ్లో దాక్కుంది - Python Struck in Bathroom Freezer - PYTHON STRUCK IN BATHROOM FREEZER
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 15, 2024, 7:16 PM IST
Python in the Bathroom at Vizag Arilova: విశాఖ ఆరిలోవ ప్రాంతంలోని ఓ ఇంట్లో కొండచిలువ కలకలం సృష్టించింది. బాత్ రూమ్ ప్రెజర్ ట్యాంక్ నుంచి నీళ్లు రాకపోవడంతో తెరిచి చూడగా కొండచిలువ కనిపించింది. దీంతో భారీ సైజులో ఉన్న కొండచిలువను చూసి కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. వారు వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న కొద్దిసేపటికి అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని కొండచిలువను బాత్ రూమ్‌లో నుంచి చాకచాక్యంగా బయటకు తీశారు.
ఆ తర్వాత దానిని అడవిలో విడిచిపెట్టారు. దీంతో స్థానికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. భారీ పొడవుగా ఉన్న కొండచిలువను చూసిన స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. అడవికి దగ్గరగా ఉండే ఏజెన్సీ ప్రాంతం కావడంతో వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు. కానీ కొండచిలువ బాత్ రూమ్ ప్రెజర్ ట్యాంక్‌లోకి ఎలా వెళ్లిందో కుటుంబసభ్యులకు అంతు చిక్కలేదు. కొండచిలువ వల్ల ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. దానిని వీడిచిపెట్టిన అనంతరం అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సిబ్బంది సూచించారు.