శ్రీరామ నవమి రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది: పీవీ సింధు - PV SINDHU AT TIRUMALA - PV SINDHU AT TIRUMALA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 17, 2024, 12:44 PM IST
PV Sindhu at Tirumala: తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సింధు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం సింధు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించి మెుక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో సింధు కుటుంబానికి పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ రామనవమి పర్వదినాన శ్రీవారి దర్శన భాగ్యం కలగడం చాలా సంతోషంగా ఉందని, జరగబోయే టోర్నమెంట్లో విజయం సాధించాలని శ్రీవారిని కోరుకున్నట్లు సింధు తెలిపారు.
PV Sindhu at Sri kalahasti Temple: శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని పీవీ సింధు (PV Sindhu) కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం సందర్శించారు. ఆలయ అధికారులు సింధు కుటుంబ సభ్యులకు స్వాగతం పలికి వాయు లింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి దర్శన ఏర్పాట్లు చేశారు.