ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం - డివైడర్ల మధ్య ఎండిపోయిన మొక్కలు - Plants Drying in Kurnool City - PLANTS DRYING IN KURNOOL CITY

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 24, 2024, 6:58 PM IST

PullaReddy Said Plants Drying Upto Authorities Negligence: కర్నూలులో నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే డివైడర్ల మధ్య నాటిన మొక్కలు ఎండిపోతున్నాయని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకుడు పుల్లారెడ్డి అన్నారు. మొక్కలు నాటి సంవత్సరం కుడా గడవకముందే ఎలా ఎండిపోతాయని ఆయన ప్రశ్నిస్తున్నారు. కొండారెడ్డి బురుజు, సి.క్యాంపు కూడలి వద్ద మొక్కలు ఎండిపోతే అధికారులు స్పందించట్లేదని మండిపడ్డారు. మొక్కలు ఎండిపోవడంపై దర్యాఫ్తు చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

నగరంలో 4 కిలోమీటర్ల వరకు వేల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకొచ్చి నాటిన మొక్కలు ఎండిపోతే కనీస బాధ్యత నగరపాలక అధికారులు తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మొక్కలు ఎండిపోవడానికి కారణం నీళ్లు వేయకపోవడమా లేక తక్కువ సామర్థ్యం గల వాటిని తీసుకొచ్చారా అని అధికారులను పుల్లారెడ్డి ప్రశ్నిస్తున్నారు. డివైడర్ల మధ్య కొన్ని వందల మొక్కలు నాటితే అన్ని ఎండిపోయాయని ఆయన విమర్శించారు. ప్రజలు పన్నులు కట్టిన డబ్బును ఈ విధంగా నగరపాలక సంస్థ అధికారులు వృథా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

ABOUT THE AUTHOR

...view details