ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ శ్రేణుల దాడి- నిరసనకు దిగిన టీడీపీ నేతలు- ప్రత్యక్షప్రసారం - protest AGAINST Attack on Nani - PROTEST AGAINST ATTACK ON NANI

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 14, 2024, 4:18 PM IST

Updated : May 14, 2024, 7:58 PM IST

Protest Against YSRCP Leaders Attack on Pulivarthi Nani Live: ఓటమి భయంతో వైఎస్సార్సీపీ శ్రేణులు రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఏజెంట్లపై విచక్షణారహితంగా కర్రలు, కత్తులు, రాళ్లతో దాడులకు పాల్పడుతున్నారు. తెలుగుదేశం నేతల ఇళ్లపై సైతం రాళ్లు రువ్వుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ప్రజలను భయపెట్టటమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్రంలో విధ్వంసకాండ సృష్టిస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైఎస్సార్సీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్‌ రూమ్‌ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా ఆయనపై దాడికి తెగబడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల దాడిలో నాని భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. పులివర్తి నాని కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్తల దాడిని నిరసిస్తూ పద్మావతి మహిళా వర్సిటీ రహదారిపై బైఠాయించి నాని నిరసన చేపట్టారు. టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని నిరసన పద్మావతి మహిళా వర్సిటీ నుంచి ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : May 14, 2024, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details