'మద్యం షాపు వద్దు' - ఎక్సైజ్ కార్యాలయం ఎదుట స్థానికుల ఆందోళన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 19, 2024, 3:47 PM IST
Protest Against Wine Shop Near Temple in Adhoni : కర్నూలు జిల్లా ఆదోని ఎక్సైజ్ కార్యాలయం దగ్గర కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని ప్రభాకర్ థియేటర్ వద్ద ఉన్న శ్రీ శంభూలింగేశ్వర దేవాలయం వద్ద తెరిచిన మద్యం దుకాణాన్ని మూసివేయాలంటూ ఎక్సైజ్ కార్యాలయం ముందు కాలనీ వాసులు ధర్నా చేశారు. అనంతరం ఎక్సైజ్ సీఐ సైదులుకు ఫిర్యాదు చేశారు. మద్యం దుకాణం వేరే ప్రాంతానికి మారుస్తామని సీఐ హామీ ఇవ్వడంతో ఆదోళనకారులు ధర్నాను విరమించారు. గుడికి ఎదురుగా మహారాజా వైన్ షాప్ను తొలగించాలని స్థానికులు ఆందోళనకు దిగారు. శివమాలాదారుల ఎదుట సారాకొట్టు నిర్వహించడం దారుణమని ఆందోళనకారులు వాపోయారు. ఎక్సైజ్ సీఐ తమ ఫిర్యాదును తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించారని హర్షం వ్యక్తం చేశారు.
లాటరీలో మద్యం దుకాణాలు పొందినవారు. ఇప్పటికే వైన్ షాప్ల నిర్వహణ ప్రారంభించారు. ఈ క్రమంలో పలు చోట్లు గొడలవలు, దందాలు జరగుతున్నాయి. పలువురు నేతలు దుకాణాదారులతో బేరాలు పెట్టుకుంటున్నారు.