'డేటా సైన్స్‌లో ఉద్యోగాలకు పెరుగుతున్న డిమాండ్ - ఇలా చేస్తే జాబ్ గ్యారంటీ' - Prof Ramesh Loganathan Interview
Published : Apr 11, 2024, 7:43 PM IST
Prof Ramesh Loganathan Interview : ఆధునిక యుగంలో సాంకేతికతకు పెరుగుతున్న ఆదరణ అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్క రంగంలో టెక్నాలజీ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. దాంతో సాంకేతికత రాను రాను కొత్తపుంతలు తొక్కుతోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం కోసం యువత ఎక్కువగా డేటా సైన్స్ కోర్సు నేర్చుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. డేటా సైన్స్ ద్వారా ఒక వ్యాపారానికి కావాల్సిన అన్ని విషయాలపై వారికి అవగాహన ఉంటుందని ట్రిపుల్ ఐటీ హైదారాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ రమేశ్ లోగనాథం అంటున్నారు.
దీని ద్వారా మార్కెట్ డిమాండ్‌ను బట్టి వారికి శిక్షణ ఇచ్చిన ప్రకారం వ్యాపారానికి కావాలని ఇన్పుట్స్ ఇస్తారని, ఇలా బిజినెస్ డెవెలప్మెంట్కు ఉపయోగపడుతుందన్నారు. డేటా సైన్స్‌తో ప్రతి ఒక్క సమాచారాన్ని తెలుసుకోవచ్చని చెప్పారు. అందుకే ఇప్పటి యువత దాని ద్వారా ఉపాధి పొందాలని చూస్తున్నారన్నారు. మరి, డేటా సైన్స్‌లో నైపుణ్యం సంపాధించడం ఎలా? ఎటువంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి? అనే విషయాలను ప్రొఫెసర్ రమేశ్ లోగనాథం మాటల్లోనే విందాం.