ఈ లైన్మెన్కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - తాడుపై నడుస్తూ వాగు దాటి - విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి - LINEMAN WALKING WIRES - LINEMAN WALKING WIRES
Published : Jul 27, 2024, 6:28 PM IST
Power Staff Cross Surging Stream to Restore Electricity In AP : ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండలం నూరుపూడి గ్రామంలో విద్యుత్ సమస్య పరిష్కారం కోసం ప్రమాదకరమైన వాగును దాటాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్ లైనుకు సమస్య తలెత్తడంతో అక్కడ పని చేస్తున్న లైన్మెన్ రాము తాడుపై నడుస్తూ వాగును దాటారు. ఈ మార్గంలో పెద్ద కొండవాగు ప్రస్తుత వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగును దాటేందుకు వంతెన లేకపోవడంతో అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీంతో అటు ఇటు చెట్లకు తాడును కట్టి లైన్మెన్ సాహసం చేసి సరఫరాను పునరుద్ధరించారు.
గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వాగును దాటేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ వాగుపై వంతెన నిర్మాణానికి గత ప్రభుత్వం శంకుస్థాపన చేశారు. కానీ ఇంతవరకు వంతెన నిర్మించలేదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో గిరిజనులు తాడు సాయంతో వాగు దాటుతున్నారు. లైన్మెన్ చేసిన సాహసానికి ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. అదే విధంగా వంతెన నిర్మాణానికి అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.