ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వాహనాల తనిఖీలో భారీగా బంగారం పట్టివేత - డ్రైవర్ సీటు కింద పెట్టి తరలిస్తుండగా స్వాధీనం - ap latest news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 12:26 PM IST

Police Seized Gold in Rajampeta : అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణ శివారులోని భవనగిరిపల్లి ముఖద్వారం వద్ద సీఐ మద్దయ్యచారి, సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో నంబరు ప్లేటు లేని ఓ కారును తనిఖీ చేయగా అందులో 1.338 కిలోల బంగారం పట్టుబడినట్లు సీఐ మద్దయ్యచారి తెలిపారు. ఈ మేరకు ఆయన వివరాలు వెల్లడించారు.

వాహనంలో డ్రైవరు షేక్ అజ్మత్​తో పాటు మరో వ్యక్తి మహమ్మద్ జిలానీ ఉండగా ఇద్దరినీ విచారించామని, వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చి క్షుణ్నంగా తనిఖీ చేసినట్లు సీఐ మద్దయ్యచారి చెప్పారు. డ్రైవరు సీటు కింద స్పాంజ్ లాంటి దిండుని స్వాధీనం చేసుకుని పరిశీలించగా బంగారు బిస్కెట్లు ఉన్నాయని అన్నారు. వాటికి సంబంధించిన బిల్లులు వారి వద్దలేవని, దీంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.కోటి ఉంటుందని చెప్పారు. సేల్స్ ట్యాక్స్ సహాయ కమిషనర్​కి రిపోర్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details