ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కంకిపాడులో పోలీసుల కార్డెన్‌ సెర్చ్ - సరైన పత్రాలు లేని 20 వాహనాలు సీజ్ - Police Cordon Search in Krishna - POLICE CORDON SEARCH IN KRISHNA

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 28, 2024, 8:18 PM IST

Updated : May 28, 2024, 8:30 PM IST

Police Cordon Search in Krishna District For Peacefull Vote Counting : కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లులోని B.C. కాలనీ కరకట్టపై పోలీసులు కార్డెన్‌ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు, గన్నవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య దిశానిర్దేశంతో, కంకిపాడు సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎవరైనా అనుమానితులు గానీ కొత్త వ్యక్తులు గాని ఉన్నారనే ఉద్దేశంతో ప్రతి ఇంటిలో ఉన్న వ్యక్తుల ఆధార్ కార్డులను పరిశీలించారు. ఈ తనిఖీలలో భాగంగా సరైన పత్రాలు చూపించని 20 వాహనాలను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు సీఐ రామారావు, కంకిపాడు ఎస్సై, అదనపు ఎస్సై, పెనమలూరు ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు వేళ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీస్​ అధికారులు స్పష్టం చేశారు.

Last Updated : May 28, 2024, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details