అణువణువు తనిఖీలు ఎక్కడపడితే అక్కడ బారికేడ్లు- పోలీసుల అత్యుత్సాహం - People Problems in kanigiri
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 18, 2024, 3:54 PM IST
Police Barricades, Inspections People Problems in Ongole : అణువణువు తనిఖీలు ఎక్కడపడితే అక్కడ బారికేడ్లు పెట్టి అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాల్సిన పోలీసులు అందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావటంతో పోలీసులు పలు చోట్ల నిబంధనలు కట్టుదిట్టం చేశారు.
తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ట్రెజరీ కార్యాలయం, అగ్రికల్చర్ ఆఫీసు, ఐసీడీఎస్ ICDS సిబ్బంది ఆఫీసు ఉండటంతో అక్కడికి వెళ్లే ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వివిధ పనుల కోసం వచ్చిన వారికి విఘాతం కలిగిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులను వివరణ కోరగా స్థానిక ఆర్డీఓ RDO ఆదేశాల మేరకే చర్యలు చేపట్టామని తెలిపారు. ఎక్కడెక్కడ నుంచో ఎండలో ఇంత దూరం వస్తే ఈ అడ్డంకులు ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.