ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ - ప్రత్యక్ష ప్రసారం - PM NARENDRA MODI IN VISAKHAPATNAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2025, 4:56 PM IST

Updated : Jan 8, 2025, 7:09 PM IST

LIVE: విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. మూడో సారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత రెండో సారి మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. వివిధ రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వరకు మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్​ కలిసి భారీ రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభ జరగనుంది. సభా వేదిక పైనుంచి వర్చువల్ విధానంలో వివిధ పథకాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడితో 1200 ఎకరాల్లో నిర్మించనున్న ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు భూమిపూజ చేస్తారు. రూ.1500 కోట్లతో ఏర్పాటు చేయనున్న కృష్ణపట్నం పారిశ్రామిక హబ్, రూ.1800ల కోట్లతో నక్కపల్లిలో ఏర్పాటు చేయనున్న భారీ ఔషధ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. చెన్నై - బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా తిరుపతి జిల్లాలో కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతానికి కూడా మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రత్యక్ష ప్రసారం మీ కోసం
Last Updated : Jan 8, 2025, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details