తెలంగాణ

telangana

ETV Bharat / videos

వారిని ముందు వరుసకు తీసుకొచ్చాకే నేను ప్రసంగిస్తా - మరోసారి ఔదార్యం చాటుకున్న ప్రధాని మోదీ - PM Modi to disabled women - PM MODI TO DISABLED WOMEN

By ETV Bharat Telangana Team

Published : May 10, 2024, 8:57 PM IST

PM Modi to Disability women in BJP Meeting : నారాయణపేటలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇవాళ మహబూబ్​నగర్‌ లోక్‌సభ పరిధి నారాయణపేటలో జరిగిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ, మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సభలో వెనక వరుసలో ఉన్న దివ్యాంగులను చూసి చలించిన ఆయన వారిని ముందు వరుసలోకి తీసుకొచ్చే వరకు ప్రసంగించబోనని స్పష్టం చేశారు. వారిని జనం మధ్యలో నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకు రమ్మని కమలం కార్యకర్తలకు సూచించారు. 

దివ్యాంగులపై మోదీ ఔదార్యం : దీంతో సభకు హాజరైన ఇద్దరు దివ్యాంగ మహిళలను వాలంటీర్లు సభా ప్రాంగణం ముందు వరుసలోకి తీసుకొచ్చారు. అనంతరం ప్రధాని ప్రసంగం కొనసాగించారు. తనపై ప్రేమతో వ్యయప్రయాసలకు ఓర్చి బహిరంగ సభకు హాజరైనందుకు ఆ దివ్యాంగులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ. అక్కడున్న బీజేపీ శ్రేణులతో పాటు సభకు వచ్చిన ప్రజలు సైతం ఒకింత ఆనందంతో ఈ దృశ్యాన్ని చూశారు.

ABOUT THE AUTHOR

...view details