ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎమ్మెల్యే ఉష శ్రీచరణ్ ఎక్కడ ? సమస్యలు ఏనాడూ పట్టించుకోలేదని ప్రజలు ఆగ్రహం - People angry with Usha Sricharan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 9:35 PM IST

People Fire on YCP MLA Usha Sri Charan : తాము ఓట్లు వేసి గెలిపించుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఉష శ్రీచరణ్ ఏనాడూ తమ సమస్యలు పట్టించుకోలేదని కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని ఎర్రనేల వీధిలో మురుగునీటి కాల్వలు శుభ్రం చేయాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే, అధికారులు ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా కాలనీ సమస్యలపై దృష్టి పెట్టలేదని మండిపడ్డారు. కాల్వల్లో మురుగు నిలిచిపోవడంతో దోమలు విజృంభించి విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే విష జ్వరాల బారిన పడి వేల రూపాయలు వైద్యం కోసం వెచ్చించామని తెలిపారు.

 మురుగు, దుర్వాసనతో ఇళ్లలో ఉండలేకపోతున్నామన్నారు. ఈ దుర్వాసన వల్ల పగలు, రాత్రి ఇంటి తలుపులు, కిటికీలు మూసుకొని ఉండాల్సి వస్తోందన్నారు. పురపాలిక అధికారులు మాత్రం ఆస్థి పన్నులు చెల్లించే వరకు చాటింపులేస్తూ, ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, అధికారులు స్పందించి మురుగు నీటిని శుభ్రం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.  

ABOUT THE AUTHOR

...view details