ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కలుషిత నీరు తాగి ప్రజలకు అస్వస్థత - వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతి - Contaminated Drinking Water - CONTAMINATED DRINKING WATER

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 27, 2024, 7:15 PM IST

People Fell Sick due to Contaminated Drinking Water: విజయవాడలోని మొగల్రాజపురంలో పదుల సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. వారం రోజుల వ్యవధిలో వాంతులు, విరేచనాలతో ఇద్దరు మరణించారు. కలుషిత నీరు తాగటం వల్లే అస్వస్థతకు గురై మరణిస్తున్నారని స్థానికులు వాపోయారు. స్థానిక ప్రజలకు వైద్యం అదించే వైద్యులూ తాగునీరే కారణమని చెబుతున్నారని చెప్పారు. తాగు నీటిలో చెత్తా, చెదారం వస్తోందని తెలిపారు. దీంతోపాటు పారిశుద్ధ్య సమస్యతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

వీఎంసీ అధికారులకు సమస్య గురించి చెప్పినా వారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాళ్లు, చేతుల నొప్పులు, వాంతులు, విరేచనాలతో పాటు నీరసంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అస్వస్థతకు గురైనవారు నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులతోపాటు, ప్రథమ చికిత్స కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యకు తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు.  

ABOUT THE AUTHOR

...view details